రాజకీయ వైరాలను పక్కన పెట్టి ఏకం కావాల్సిన సమయం వచ్చింది: పళనిస్వామికి స్టాలిన్ లేఖ
- కొత్త రైతు చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేద్దాం
- అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయండి
- పంజాబ్ తర్వాత కేరళ కూడా వ్యతిరేకంగా తీర్మానం చేసింది
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి డీఎంకే అధినేత స్టాలిన్ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసేందుకు వెంటనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని లేఖలో స్టాలిన్ కోరారు. రైతులకు రుణమాఫీ చేసిన, ఉచిత విద్యుత్ ఇచ్చిన తొలి రాష్ట్రం తమిళనాడు అని... ఇప్పుడు అదే రైతుల కోసం అందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.
రాజకీయ వైరాలను పక్కన పెట్టి, రైతుల కోసం అందరం కలిసి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేద్దామని స్టాలిన్ అన్నారు. పంజాబ్ తర్వాత కేరళ కూడా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసిందని చెప్పారు. డిసెంబర్ 18న రైతు చట్టాలను నిరసిస్తూ ఒక రోజు నిరాహార దీక్షను కూడా స్టాలిన్ చేపట్టడం గమనార్హం.