అణు కేంద్రాల జాబితాలను ఇచ్చిపుచ్చుకున్న ఇండియా, పాకిస్థాన్
- గత 30 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రకియ
- 1991 జనవరిలో అమల్లోకి వచ్చిన ఒప్పందం
- అణు కేంద్రాలు ఉన్న ప్రాంతాలపై దాడి చేయకూడదని ఒప్పందం
తమ దేశాల్లో ఉన్న అణు స్థావరాలు, అణుశక్తి ఆధారిత కేంద్రాల జాబితాను భారత్, పాకిస్థాన్ లు ఇచ్చిపుచ్చుకున్నాయి. గత 30 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రక్రియను ఈ ఏడాది కూడా కొనసాగించాయి. అణు స్థావరాలపై దాడులు చేసుకోకుండా ఉండటం కోసం ఇరు దేశాలు వాటి వివరాలను ప్రతి ఏటా ఇచ్చిపుచ్చుకుంటాయి. దౌత్య వర్గాల ద్వారా న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ లలో ఇరు దేశాలు తమ వివరాలను అందించాయి. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.
యుద్ధ సమయాల్లో కూడా అణుస్థావరాలు, అణు ఆధారిత కేంద్రాలు ఉన్న ప్రాంతాలపై దాడి చేయకుండా ఉండేందుకు ఈ మేరకు ఇరు దేశాల మధ్య 1988 డిసెంబర్ 31న ఒప్పందం కుదిరింది. 1991 జనవరి 27 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఒప్పందం ప్రకారం ప్రతి ఏటా జనవరి 1వ తేదీన అణు సంబంధిత సమాచారాన్ని రెండు దేశాలు ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఒప్పందం ప్రకారం జాబితాలోని స్థావరాలపై దాడి చేయకూడదు.