డిసెంబరు మాసంలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు... ఇప్పటివరకు ఇవే అత్యధికమన్న కేంద్రం
- దేశంలో జీఎస్టీ వసూళ్ల సందడి
- డిసెంబరులో రూ.1,15,174 కోట్లు వసూలు
- తెలంగాణ నుంచి రూ.3,543 కోట్లు వసూలు
- ఏపీ నుంచి రూ.2,581 కోట్లు వసూలు
దేశంలో ఈ డిసెంబరు మాసంలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు వచ్చినట్టు కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా రూ.1,15,174 కోట్లు జీఎస్టీ రూపంలో వసూలైనట్టు కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు దేశంలో ఇదే అత్యధికమని పేర్కొంది. సీజీఎస్టీ రూ.21,365 కోట్లు, ఎస్ జీఎస్టీ రూ.27,804 కోట్లు, ఐజీఎస్టీ రూ.57,426 కోట్లు, సెస్ రూపంలో రూ.8,579 కోట్లు వసూలైనట్టు వివరించింది.
ఏపీ నుంచి డిసెంబరులో రూ.2,581 కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు వచ్చినట్టు కేంద్రం పేర్కొంది. 2019 డిసెంబరుతో పోల్చితే ఈ డిసెంబరులో జీఎస్టీ వసూళ్లు 14 శాతం పెరిగినట్టు గుర్తించారు. ఇక, తెలంగాణ నుంచి రూ.3,543 కోట్ల జీఎస్టీ వసూలైంది. 2019 డిసెంబరుతో పోల్చితే తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు 4 శాతం పెరిగాయి.