సూర్యాపేటలో కలకలం.. ఒకే కుటుంబంలో 22 మందికి పాజిటివ్
- ఇటీవలే అంత్యక్రియలకు వెళ్లొచ్చిన ఒక వ్యక్తి
- ఆయనకు కరోనా సోకడంతో కుటుంబ సభ్యులకు పరీక్షలు
- కాంటాక్ట్ లోకి వచ్చిన వారిని గుర్తిస్తున్న వైద్య సిబ్బంది
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలోని సూర్యాపేటలో కరోనా భయాందోళనలను రేకెత్తించింది. ఒకే కుటుంబానికి చెందిన 22 మంది కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని డీఎంహెచోఓ తెలిపారు.
కుటుంబంలోని ఒక వ్యక్తి ఇటీవల ఒకరి అంత్యక్రియలకు వెళ్లి వచ్చారని, ఆయనకు కరోనా సోకిందని డీఎంహెచ్ఓ చెప్పారు. అనంతరం కుటుంబ సభ్యులకు కోవిడ్ పరీక్షలను నిర్వహించగా.. 22 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని ఆయన వెల్లడించారు. అయితే వీరిలో కరోనా లక్షణాలు పెద్దగా లేవని, పరీక్షలు నిర్వహించిన తర్వాతే కరోనా అని తేలిందని చెప్పారు. ఈ నేపథ్యంలో వీరికి కాంటాక్ట్ లోకి వచ్చిన వారిని గుర్తించే పనిలో వైద్య సిబ్బంది ఉన్నారని తెలిపారు. కరోనా కేసుల నేపథ్యంలో సదరు కుటుంబం ఉన్న ప్రాంతాన్ని శానిటైజ్ చేశారు.