దేశీయ టీకాకు చైనా అనుమతి.. అందరికీ ఉచితం!
- టీకాను అభివృద్ధి చేసిన స్వదేశీ ఫార్మా సంస్థ సినోఫార్మ్
- 79.34 శాతం సమర్థత కనబరిచిన టీకా
- 70 కోట్ల మందికి టీకా ఇవ్వాల్సి ఉంటుందన్న అధికారులు
దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి కరోనా టీకా సాధారణ వినియోగానికి చైనా నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఇందుకు సంబంధించి కొన్ని షరతులు కూడా విధించింది. ‘సినోఫార్మ్’ అభివృద్ధి చేసిన ఈ టీకా 79.34 శాతం సమర్థత కనబరచగా, 99.52 శాతం యాంటీబాడీ-పాజిటివ్ కన్వర్షన్ రేటును సాధించింది. తాజాగా, ఈ టీకాకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం దేశ ప్రజలందరికీ ఉచితంగా వేయనున్నట్టు తెలిపింది.
సినోఫార్మ్ అభివృద్ధి చేసిన టీకా ఇచ్చిన చోట నొప్పి, చర్మం ఎర్రగా మారడం, జ్వరం, కండరాల నొప్పుల వంటి సమస్యలే తప్ప తీవ్రమైన దుష్ప్రభావాలేమీ లేవని అధికారులు తెలిపారు. ఈ టీకాకు మొత్తం 10 దేశాల్లో మూడో దశ ప్రయోగాలు నిర్వహించగా 70 వేల మంది వలంటీర్లు పాల్గొన్నారు.
దేశం నుంచి కరోనా మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టాలంటే మొత్తం 70 కోట్ల మందికి టీకాలు వేయాల్సి ఉంటుందని, ఇందుకోసం 140 కోట్ల డోసులు అవసరమని అధికారులు తెలిపారు. అయితే, ఏడాదికి గరిష్టంగా 70 కోట్ల టీకాలు మాత్రమే ఉత్పత్తి అవుతున్న వేళ స్వల్పకాలంలో ఇంతమందికి టీకా వేయడం సవాలేనని పేర్కొన్నారు.