రైల్వే బోర్డు నూతన చైర్మన్‌గా సునీత్ శర్మ నియామకం

  • ముగిసిన వినోద్ కుమార్ యాదవ్ పదవీకాలం
  • రైల్వే పాలనా సంస్కరణల్లో సునీత్ శర్మది కీలక పాత్ర
  • భారతీయ రైల్వే వందశాతం విద్యుద్దీకరణకు కృషి
రైల్వే బోర్డు చైర్మన్‌ వినోద్ కుమార్ యాదవ్ పదవీకాలం నిన్నటితో ముగియడంతో ఆయన స్థానంలో ఈస్టర్న్ రైల్వే మాజీ జనరల్ మేనేజర్ సునీత్ శర్మను చైర్మన్, సీఈవోగా నియమిస్తూ కేంద్ర నియామకాల కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 1978 బ్యాచ్ స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటిస్ అధికారి అయిన సునీత్ శర్మ భారతీయ రైల్వే వందశాతం విద్యుద్దీకరణ కావడానికి ఎంతగానో కృషి చేశారు.

ఎంతో సాంకేతిక నైపుణ్యం వున్న ఆయన రైల్వేలోని వివిధ విభాగాల్లో 34 ఏళ్లపాటు పనిచేశారు. రైల్వే పాలనా సంస్కరణల్లోనూ కీలక పాత్ర పోషించారు. రాయ్‌బరేలీలోని అత్యాధునిక రైలు బోగీల తయారీ కేంద్రంలో సునీత్ శర్మ జనరల్ మేనేజర్‌గానూ పనిచేశారు. కాగా, వినోద్ కుమార్ యాదవ్‌ పదవీ కాలాన్ని ప్రభుత్వం గత జనవరిలో ఏడాది పాటు పొడిగించింది. ఇప్పుడు ఆయన పదవీ కాలం ముగియడంతో నూతన చైర్మన్‌ను నియమించింది.


More Telugu News