బ్రిటన్‌కు 1000 మంది కర్ణాటక నర్సులు.. ఒక్కొక్కరికి రూ. 20 లక్షల వార్షిక వేతనం

  • కర్ణాటక-బ్రిటన్ మధ్య ఒప్పందం
  • శిక్షణ ఇచ్చి పంపించనున్న ప్రభుత్వం
  • యూరప్ దేశాల్లో భారతీయ నర్సులకు డిమాండ్ ఉందన్న డిప్యూటీ సీఎం
భారతీయ నర్సులకు ఐరోపా దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉందని, ఇక్కడి నర్సులను రిక్రూట్ చేసేందుకు అక్కడి ఆసుపత్రులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చినట్టు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్ నారాయణ్ తెలిపారు.

ఈ నేపథ్యంలో తొలి విడతగా 1000 మంది నర్సులకు ఒకేషనల్ ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చి బ్రిటన్ పంపించనున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు కర్ణాటక రాష్ట్ర నైపుణ్య అభివృద్ధిశాఖ, బ్రిటన్‌కు చెందిన చెందిన నేషనల్ హెల్త్ సర్వీసెస్ (ఎన్‌హెచ్ఎస్), హెల్త్ ఎడ్యుకేషన్ ఇంగ్లండ్ (హెచ్ఈఈ)ల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలిపారు. ఉద్యోగం పొందిన నర్సులకు వార్షిక వేతనం కింద రూ. 20 లక్షలు లభిస్తుందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.


More Telugu News