సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • గోవాలో తన గ్యాంగ్ తో రష్మిక సెలెబ్రేషన్స్!
  • సంక్రాంతి తర్వాత నుంచి మహేశ్ సినిమా
  • మలయాళ ముద్దుగుమ్మ తెలుగు పాట    
*  అందాలభామ రష్మిక మందన్న ఈ న్యూ ఇయర్ వేడుకల్ని గోవాలో జరుపుకుంది. "నా గ్యాంగ్ తో కలసి గోవాకొచ్చాను. ఇక్కడే ఓ అందమైన ప్రదేశంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నాను. సెలవులకు అప్పుడప్ప్పుడు ఈ గ్యాంగ్ తోనే చెక్కేస్తుంటాను" అని చెప్పింది రష్మిక.
*  మహేశ్ బాబు హీరోగా నటించనున్న 'సర్కారు వారి పాట' చిత్రం షూటింగ్ సంక్రాంతి తర్వాత నుంచి హైదరాబాదులో మొదలవుతుంది. హైదరాబాదు షెడ్యూలు తర్వాత అమెరికా షెడ్యూలు ఉంటుంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది.
*  మలయాళ కథానాయిక ప్రియా ప్రకాశ్ వారియర్ మంచి సింగర్ అన్న విషయం తెలిసిందే. ఈ చిన్నది ఇప్పుడు తెలుగులో కూడా ఓ పాటను పాడి విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిన్నది తెలుగులోనితిన్ సరసన 'చెక్' సినిమాలో నటిస్తోంది.


More Telugu News