నేటి తరం ప్రజలు చూసిన అద్భుతమైన సంవత్సరం 2020... కారణమేంటో చెప్పిన పూరీ జగన్నాథ్!
- 2020 ఎన్నో అనుభూతులను అందించింది
- అందరూ తిట్టుకున్నా ప్రజలకు ఎన్నో నేర్పింది
- పూరీ మ్యూజింగ్స్ లో తాజా వీడియో
ఈ తరం ప్రజలు చూసిన అత్యద్భుతమైన ఉత్తమ సంవత్సరం 2020 అని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన 'పూరీ మ్యూజింగ్స్'లో ఓ వీడియోను పెట్టిన ఆయన, గడచిపోయిన సంవత్సరం ఎటువంటి అనుభూతులను అందించిందో చెప్పుకుంటూ వచ్చారు.
"అందరూ 2020ని తిట్టుకుంటున్నారు. కానీ, మన లైఫ్‌లో బెస్ట్ ఇయర్ మాత్రం 2020యే. 2020 మనకి చాలా నేర్పింది. హెల్త్ ఎంత ఇంపార్టెంటో అర్థమైంది. ఇమ్యూనిటీ చాలా అవసరమని తెలిసింది,. గుడ్ ఫుడ్ వాల్యూ తెలిసింది. క్లీనింగ్ నెస్ నేర్పింది. పుట్టిన తరువాత ఎప్పుడూ మనం ఇన్నిసార్లు హ్యాండ్ వాష్ చేసుకోలేదు.
పల్లెటూళ్లలో చదువుకోని వారికి కూడా చాలా విషయాలు తెలిశాయి. వైరస్, మ్యూటేషన్, శానిటైజర్, క్వారంటైన్, యాంటీ బాడీస్, ప్లాస్మా, స్ట్రెయిన్ ఇలా ఎన్నో విషయాలు తెలిసిపోయాయ్. మొదట్లో నెలరోజులు లాక్ డౌన్ అంటే మనకి పిచ్చి లేచింది. ఖాళీగా ఇంటిలో కూర్చోవాలంటే, మెంటల్ హెల్త్ చాలా అవసరం అని తెలుసుకున్నాం. మనలో సహనం పెరిగింది. ఆత్మనిర్భార్.. ఆ తర్వాత మెల్లగా కామ్ అయ్యాం. అన్నీ మూసుకుని కూర్చొని ఉన్నాం.
8 నెలలు ఎలా గడిచిపోయాయో మనకే తెలియదు. డబ్బు ఉన్నా, లేకపోయినా.. ఎలా బతికామో మనకే తెలియదు. నిజమైన ఫ్రెండ్స్ ఎవరో ఇప్పుడే తెలిసింది. లైఫ్ లో సేవింగ్స్ ఎంత అవసరమో తెలిసివచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ నేర్చుకున్నాం. బంగారం, కొత్తచీరలు లేకుండా బతకడం నేర్చుకున్నారు ఆడవాళ్లు. అవసరమైనవి మాత్రమే కొనుక్కున్నారు.
అనవసరమైన షాపింగ్‌లు, చిరుతిళ్లు తగ్గాయ్. నేచర్ చాలా పవర్‌ఫుల్ అని తెలిసింది. ఏ దేవుడూ మనల్ని కాపాడలేడని తెలిసింది. ఎవరైనా చిన్న సాయం చేస్తే దాని వాల్యూ మనకు అర్థమైంది, రెండు నిమిషాలు బ్రీత్ లాస్ అయితే చాలు... ప్రాణాలు పోతాయి. చావు అనేది పెద్ద విషయం కాదని తెలిసింది. అనుక్షణం మనం ఒళ్లు దగ్గర పెట్టుకుని బతికాం" అని పూరీ వ్యాఖ్యానించారు.
ఆయన తన వీడియోలో ఇంకా చెప్పుకుంటూ వచ్చారు. గడచిన 2020లో కరోనా ప్రజల్లో ఎటువంటి మార్పును తీసుకువచ్చిందో చెప్పిన పూరీ మాటలను ఈ ఆడియోలో మీరూ వినవచ్చు.