పారిశ్రామికవేత్తలకు చేసిన రుణమాఫీతో 11 కోట్ల మందికి లబ్ధి చేకూరేది: రాహుల్ గాంధీ

  • కేంద్రంపై రాహుల్ ధ్వజం
  • రూ.2.37 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని వెల్లడి
  • ఆ డబ్బు పేదలకు ఇస్తే బాగుండేదని స్పష్టీకరణ
  • మోదీ అభివృద్ధి అసలు స్వరూపం ఇదేనని వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పారిశ్రామికవేత్తలకు ఈ ఏడాది రూ.2.37 లక్షల కోట్ల మేర రుణమాఫీ చేశారని, కానీ ఆ మొత్తంతో దేశంలో 11 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరేదని తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డారు. పారిశ్రామికవేత్తలకు ఇచ్చే బదులు కరోనాతో నష్టపోయిన వారికి ఇవ్వొచ్చు కదా? అని అసంతృప్తి వ్యక్తం చేశారు. మోదీ చెబుతున్న అభివృద్ధి అసలు స్వరూపం ఇదేనంటూ రాహుల్ విమర్శించారు.

అయితే, రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. రైటాఫ్ కు, రద్దుకు మధ్య ఉండే తేడాను రాహుల్ తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రజలను తప్పుదోవ పట్టించాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.


More Telugu News