మే 4 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు... షెడ్యూల్ ప్రకటించిన కేంద్రం
- మే 4 నుంచి జూన్ 10 వరకు పరీక్షలు
- సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలు షెడ్యూల్ ప్రకటన
- మార్చిలో ప్రాక్టికల్స్
- జూలై 15న ఫలితాల వెల్లడి
కరోనా వ్యాప్తి నేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షలను మే 4 నుంచి నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్రం ఇవాళ విడుదల చేసింది. మార్చి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 4 నుంచి జూన్ 10 వరకు పరీక్షలు ఉంటాయని, జూలై 15న ఫలితాలు వెల్లడిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ నిశాంక్ పోఖ్రియాల్ తెలిపారు.
వాస్తవానికి సీబీఎస్ఈ ప్రాక్టికల్ పరీక్షలు జనవరిలోనూ, పరీక్షలు ఫిబ్రవరి-మార్చిలోనూ జరుగుతాయి. అయితే, కరోనా మహమ్మారి ప్రభావం, కొత్త స్ట్రెయిన్ కలకలం, ఇంటర్నెట్ సమస్యలతో ఆన్ లైన్ క్లాసులు సరిగా అందుబాటులోకి రాని వైనం... తదితర సమస్యలను విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. వారి అభ్యర్థనలను సానుకూల ధోరణితో పరిగణనలోకి తీసుకున్న కేంద్రం సీబీఎస్ఈ పరీక్షలను మేలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది.