ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు షాక్.. జరిమానా విధింపు!
- తమ తీర్పును అమలు చేయలేదని హైకోర్టు ఆగ్రహం
- రూ. 1000 జరిమానా విధించిన హైకోర్టు
- ఈరోజు కోర్టు సమయం పూర్తయ్యేంత వరకు కోర్టులోనే ఉండాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కింద ఆయనకు శిక్షతో పాటు జరిమానా విధించింది. 2017లో ఇచ్చిన తీర్పును అమలు చేయనందున ఆయన కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టుగా గత వారమే హైకోర్టు స్పష్టం చేసింది.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో తమ తీర్పును అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు... ఇది తమను ధిక్కరించడమేనని ఈనెల 17న తెలిపింది. 31న తమ ముందు హాజరు కావాలని ఆయనకు ఆదేశాలను జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు ఆయన కోర్టుకు హాజరయ్యారు.
కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ఈరోజు కోర్టు సమయం ముగిసేంత వరకు ఇక్కడే కూర్చోవాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు వెయ్యి రూపాయల జరిమానా కూడా విధించింది. జరిమానా చెల్లించకపోతే వారం రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొంది.