ప్రభుత్వ అజెండానే మా అజెండా: ఏపీ కొత్త సీఎస్ ఆదిత్యనాథ్ దాస్
- అన్ని శాఖలను సమన్వయం చేసుకుని పని చేస్తాం
- సీఎం లక్ష్యం మేరకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం
- రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తాం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలను స్వీకరించారు. సచివాలయం మొదటి బ్లాక్ లో సీఎస్ నీలం సాహ్ని నుంచి బాధ్యతలను స్వీకరించారు. ఈరోజుతో సీఎస్ గా నీలం సాహ్ని పదవీకాలం ముగిసింది. రేపటి నుంచి ఆమె సీఎంకు ప్రిన్సిపల్ అడ్వైజర్ గా బాధ్యతలను నిర్వర్తించనున్నారు.
సీఎస్ గా బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ, ప్రభుత్వ అజెండానే తమ అజెండా అని చెప్పారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని పని చేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని, ఆయన లక్ష్యం మేరకు ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. అన్ని సమస్యలను అధిగమిస్తామని, అన్ని విధాలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు అధికారులందరూ పని చేస్తామని తెలిపారు. తనకు సీఎస్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పారు.