ఏపీ కరోనా అప్ డేట్: 338 కొత్త కేసులు, 4 మరణాలు

  • గడచిన 24 గంటల్లో 61,148 పాజిటివ్ కేసులు
  • అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 65 కేసులు
  • అత్యల్పంగా కర్నూలు జిల్లాలో ఆరుగురికి పాజిటివ్
  • యాక్టివ్ కేసుల సంఖ్య 3,262
ఏపీలో గడచిన 24 గంటల్లో 61,148 కరోనా టెస్టులు నిర్వహించగా, 338 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 65, కృష్ణా జిల్లాలో 44, తూర్పు గోదావరి జిల్లాలో 42 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 6, విజయనగరం జిల్లాలో 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 328 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, నలుగురు మృతి చెందారు. గుంటూరు, కడప, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరణాలు సంభవించాయి. దాంతో మొత్తం మరణాల సంఖ్య 7,108కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 8,82,286 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,71,916 మంది కరోనా కోరల నుంచి విముక్తులయ్యారు. ఇంకా 3,262 మందికి చికిత్స కొనసాగుతోంది.


More Telugu News