పవన్, లోకేశ్ ఒకే రోజు ఒకే జిల్లాలో పర్యటించారు... ఆ మాత్రం అర్థం చేసుకోలేమా?: మంత్రి కన్నబాబు

  • ఇటీవల కృష్ణా జిల్లాలో పర్యటించిన పవన్, లోకేశ్
  • చంద్రబాబుకు పవన్ వకీల్ సాబ్ అంటూ కన్నబాబు విమర్శలు
  • 2014 నుంచి చంద్రబాబు కోసమే పనిచేస్తున్నాడని ఆరోపణలు
  • కొడాలి నానిని విమర్శించే అర్హత పవన్ కు లేదని వెల్లడి
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి పవన్ కల్యాణ్ పనిచేస్తోంది చంద్రబాబు కోసమేనని ఆరోపించారు. పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ఇటీవల ఒకే రోజు కృష్ణా జిల్లాలో పర్యటించారని, దాని వెనుక ఉన్న ఆంతర్యం ఆ మాత్రం తెలుసుకోలేమా? అని వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడికి పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ లా పనిచేస్తున్నారని విమర్శించారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా సీఎం జగన్ నెలరోజుల్లోనే పరిహారం అందిస్తున్నారని, చంద్రబాబు ఏనాడైనా ఇంత త్వరగా ఇచ్చారా? అని కన్నబాబు ప్రశ్నించారు. పరిహారం అంశాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ ఎందుకు అడగలేదని నిలదీశారు. అసలు, మంత్రి కొడాలి నానిని విమర్శించడానికి పవన్ కల్యాణ్ కు ఏం అర్హత ఉందని అన్నారు. కొడాలి నాని నాలుగుసార్లు గెలిచిన వ్యక్తి అని తెలిపారు.


More Telugu News