ఈ ఏడాదిని ఫ్లాట్ గా ముగించిన మార్కెట్లు

  • ఉదయం నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు
  • 5 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • మార్పు లేకుండా ముగిసిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. కరోనా కారణంగా మార్కెట్లు భారీ నష్టాలను చవి చూశాయి. ఇదే సమయంలో రికార్డు స్థాయులను కూడా మార్కెట్లు టచ్ చేశాయి. ఏదేమైనప్పటికీ ఈ ఏడాది చివరి రోజైన ఈరోజున మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి.

ఈరోజు ప్రారంభం నుంచి మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయ్యాయి. ట్రేడింగ్ ముగిసే ముందు నిఫ్టీ 14 వేల మార్కును టచ్ చేయడం గమనార్హం. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 5 పాయింట్లు లాభపడి 47,751కి పెరిగింది. నిఫ్టీ ఏమాత్రం మార్పు లేకుండా 13,981 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.65%), సన్ ఫార్మా (1.41%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.20%), ఏసియన్ పెయింట్స్ (1.13%), టైటాన్ కంపెనీ (0.93%).

టాప్ లూజర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (-1.33%), టీసీఎస్ (-1.32%), భారతి ఎయిర్ టెల్ (-1.29%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.19%), టెక్ మహీంద్రా (-1.00%).


More Telugu News