నందం సుబ్బయ్య హత్య కేసులో ఐదుగుర్ని అరెస్ట్ చేశాం: ఎస్పీ అన్బురాజన్

నందం సుబ్బయ్య హత్య కేసులో ఐదుగుర్ని అరెస్ట్ చేశాం: ఎస్పీ అన్బురాజన్
  • ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య హత్య
  • ఏ1గా కుంభా రవి
  • రవికి, సుబ్బయ్యకి మధ్య పాత గొడవలున్నట్టు ఎస్పీ వెల్లడి
  • ఇటీవల మరోసారి ఘర్షణ జరిగిందని వివరణ
  • ఆ ఘర్షణే హత్యకు దారితీసిందన్న ఎస్పీ
కడప జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య హత్య కేసుపై జిల్లా ఎస్పీ అన్బురాజన్ మీడియాకు వివరాలు తెలిపారు. సుబ్బయ్య హత్యకేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఇందులో కుంభా రవి ఏ1 నిందితుడని చెప్పారు. కుంభా రవికి నందం సుబ్బయ్యకు మధ్య పాత గొడవలు ఉన్నాయని, ఆరేళ్ల నాటి విషయమై మరోసారి ఘర్షణ పడ్డారని, ఈ ఘర్షణే సుబ్బయ్య హత్యకు దారితీసిందని వివరించారు. రవితో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశామని, సుబ్బయ్య హత్యకేసును పారదర్శకంగా విచారణ చేస్తున్నామని ఎస్పీ అన్బురాజన్ స్పష్టం చేశారు.

కాగా, సుబ్బయ్య హత్యకేసులో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది, మునిసిపల్ కమిషనర్ ల పేర్లను కూడా చేర్చాలని కోరుతూ నారా లోకేశ్ ఆధ్వర్యంలో నిన్న ప్రొద్దుటూరులో ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. దాంతో, కోర్టును సంప్రదించి ఆ ముగ్గురు పేర్లను చేర్చే అంశం పరిశీలిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.


More Telugu News