నూతన సంవత్సర వేడుకల విషయంలో ముంబై పోలీసుల కొత్త సలహా!

  • మీ ఇంటి బెడ్రూంలో  మీరుండండి అంటూ సూచన
  • డిసెంబర్ 31న భద్రతే ముందంటున్న ఖాకీలు
  • బాధ్యతగా పార్టీలు చేసుకోవాలని హాష్ ట్యాగ్ లు
డిసెంబర్ 31 వచ్చేసింది. ఇప్పటికే చాలా మంది పార్టీ ఎలా చేసుకోవాలి.. ఎక్కడ చేసుకోవాలి అని ముందస్తు ప్రణాళికలు వేసుకునే ఉంటారు. కానీ, కరోనా మహమ్మారి ఆ ఆనందం లేకుండా చేసేసింది. ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టించేసింది. బయట పార్టీలంటే కటకటాలేనని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరికలూ పంపారు. దేశం మొత్తం అలాంటి ఆంక్షలే కనిపించబోతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వమూ రాష్ట్రాలకు దీనిపై సూచనలూ చేసింది.

అయితే, ఆంక్షల మాటెలా ఉన్నా.. దేశ ఆర్థిక రాజధాని ముంబై పోలీసులు కొంచెం కొత్తగా ఆలోచించారు. కొత్త సంవత్సర ప్లాన్లలో అది కచ్చితంగా ఉండాల్సిందేనని ఓ కొత్త సూచన చేస్తున్నారు.

అదే బ్యాబ్.. అంటే ‘బీ ఇన్ యువర్ ఓన్ బెడ్రూం’! తెలుగులో చెప్పాలంటే మీ బెడ్రూంలలో మీరుండండి అని!! కరోనా జాగ్రత్తల్లో భాగంగా జనానికి అవగాహన కల్పించేలా ముంబై పోలీసులు ఇలా కొత్తగా ప్లాన్ చేశారన్నమాట. డిసెంబర్ 31న భద్రతే ముందంటూ హాష్ ట్యాగ్ లు జోడించారు. ఇంట్లోనే ఉండండి.. భద్రంగా ఉండండి, బాధ్యతాయుతంగా పార్టీలు చేసుకోవాలంటూ హాష్ ట్యాగ్ లు పెట్టి జనానికి కొత్త సంవత్సర పార్టీ సూచనలు చేశారు.


More Telugu News