దేశ సమాఖ్య నిర్మాణాన్ని బీజేపీ బలహీనపరుస్తోంది: అసదుద్దీన్ ఒవైసీ
- కేంద్రంపై మరోసారి ధ్వజమెత్తిన ఒవైసీ
- రాష్ట్రాల అధికారాలను హస్తగతం చేసుకుంటోందని వ్యాఖ్యలు
- గత ఆరేళ్లుగా బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది
- అధికారాలను పంచుకోవడంలేదని ఆరోపణ
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై నిశితంగా విమర్శలు సంధించే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి ధ్వజమెత్తారు. రాష్ట్రాల అధికారాలను తన గుప్పిట్లోకి తీసుకుంటోందని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారును ఆక్షేపించారు.
గత ఆరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలపై కర్రపెత్తనం చెలాయించే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. అంతేకాదు, అధికారాలను రాష్ట్రాలతో పంచుకునేందుకు తిరస్కరిస్తోందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే దేశ సమాఖ్య నిర్మాణాన్ని బలహీన పరిచేందుకు చేయాల్సినంత చేసిందని ఒవైసీ విమర్శించారు.
కాగా, అసదుద్దీన్ ఒవైసీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. సిద్ధాంత సారూప్యత ఉన్న పార్టీలతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉనికి చాటుకున్న ఎంఐఎం... బీజేపీకి కంచుకోటలాంటి యూపీలో పాగా వేయాలని దృఢనిశ్చయంతో ఉంది.