కొత్త కరోనా కలకలం.. మన దేశంలో మరిన్ని కేసుల నమోదు!

  • మన దేశంలో పెరుగుతున్న కొత్త స్ట్రెయిన్ కేసులు
  • తాజాగా మరో 5 పాజిటివ్ కేసులు
  • మొత్తం 25కి చేరిన కేసుల సంఖ్య
భారత్ లో ఓ వైపు కరోనా కేసులు తగ్గుతుంటే ... మరోవైపు కొత్త స్ట్రెయిన్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో ఐదుగురికి కొత్త కరోనా నిర్ధారణ అయింది. ఈ ఐదు కేసుల్లో నాలుగు పూణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో, ఒక కేసు ఢిల్లీలోని ఐజీఐబీలో గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి  వరకు నమోదైన కేసుల సంఖ్య 25కి చేరుకుంది. ఈ 25 మందిని వారివారి రాష్ట్రాల్లోని సింగిల్ రూమ్ ఐసొలేషన్ లో ఉంచినట్టు కేంద్రం తెలిపింది.

కొత్త స్ట్రెయిన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. స్ట్రెయిన్ పాజిటివ్ వచ్చిన వారితో పాటు ప్రయాణించిన వారిని, వారి బంధువులను, వారికి కాంటాక్ట్ లోకి వచ్చిన వారిని గుర్తించి పరీక్షలను నిర్వహిస్తోంది. గత రెండు వారాల్లో ఇండియాకు వచ్చిన ప్రయాణికులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. వీరందరికీ జీనోమ్ పరీక్షలను నిర్వహిస్తోంది. మరోవైపు, అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.


More Telugu News