రైతు సంఘాలతో 5 గంటలపాటు ప్రభుత్వం చర్చలు.. జనవరి 4న మరోమారు భేటీ!
- కనీస మద్దతు ధరపై కమిటీ వేసేందుకు ప్రభుత్వం అంగీకారం
- ఆందోళన విరమించాలని కోరిన ప్రభుత్వం
- వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు ఆ ప్రసక్తే లేదన్న రైతులు
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం నిన్న ఐదు గంటలపాటు చర్చలు జరిపింది. వచ్చే నెల 4న మరోమారు చర్చలు జరపాలని రైతు సంఘాలు, ప్రభుత్వం నిర్ణయించాయి. రైతుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కనీస మద్దతు ధరపై కమిటీ వేసేందుకు, విద్యుత్ బిల్లులను పెండింగులో పెట్టేందుకు అంగీకరించింది.
మిగతా డిమాండ్లను కూడా పరిగణనలోకి తీసుకుంటామని, కాబట్టి ఆందోళన విరమించాలని రైతులను కోరింది. అయితే, రైతులు మాత్రం అందుకు ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని, అప్పటి వరకు ఆందోళన కొనసాగుతుందని తేల్చి చెప్పినట్టు సమాచారం. కాగా, రైతు సంఘాలతో ప్రభుత్వం ఇప్పటి వరకు ఆరుసార్లు చర్చలు జరిపినప్పటికీ ఏ సంగతీ తేలకుండా అసంపూర్ణంగానే ముగిశాయి.