‘ఆయుష్మాన్ భారత్’కు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్!
- ఇంతకాలం పథకం అమలును వ్యతిరేకించిన కేసీఆర్
- ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అమలుకు అంగీకారం
- ప్రధానమంత్రికి తెలియజేసిన సీఎస్ సోమేశ్ కుమార్
కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘ఆయుష్మాన్ భారత్’ను తెలంగాణలోనూ అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమల్లో ఉండడంతో ‘ఆయుష్మాన్ భారత్’ పథకం అవసరం లేదన్న ఉద్దేశంతో కేసీఆర్ ఇంతవరకు ఈ పథకం అమలును వ్యతిరేకించారు. తాజాగా, మనసు మార్చుకున్న కేసీఆర్ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణలోనూ ఆ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలోనూ అమలు చేయబోతున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రధాని నరేంద్రమోదీకి తెలియజేశారు. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సోమేశ్ కుమార్ ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.