ఎవరిది శవ రాజకీయం? తండ్రి శవం దొరక్క ముందే సంతకాలు సేకరించిన జగన్ దా?: నారా లోకేశ్
- సుబ్బయ్యను చంపిన వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయండి
- అపరాజితకు న్యాయం జరిగేంత వరకు నా దీక్ష కొనసాగుతుంది
- నిందితులను కఠినంగా శిక్షించాలి
కడప జిల్లాలో టీడీపీ నేత సుబ్బయ్యను దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ హత్యపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇదే సమయంలో టీడీపీ విమర్శలపై వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు హత్యా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు.
'ఎవరిది శవ రాజకీయం? తండ్రి శవం దొరక్క ముందే సంతకాలు సేకరించిన జగన్ రెడ్డిదా? బాబాయ్ శవాన్ని ఎన్నికల అజెండాగా వాడుకున్న జగన్ రెడ్డిదా? హత్యలు చేయిస్తూ ప్రశాంతంగా ఉన్న సీమలో రక్తం పారిస్తున్న జగన్ రెడ్డిదా? హత్యకు గురైన నందం సుబ్బయ్య కుటుంబానికి న్యాయం చెయ్యమని అడిగిన చంద్రబాబు గారిదా?' అని లోకేశ్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా నిలదీశారు.
తన భర్త సుబ్బయ్యను చంపిన వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది బంగారురెడ్డిలను అరెస్ట్ చేయాలని ఆందోళన చేస్తున్న అపరాజితకి న్యాయం జరిగేంత వరకు ప్రొద్దుటూరులోనే తన దీక్ష కొనసాగుతుందని నారా లోకేశ్ అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.