సంక్రాంతి పండుగ ముందే వచ్చేసింది: సీఎం జగన్

  • ఎన్నికల హామీల్లో 95 శాతాన్ని అమలు చేశాం
  • 28.30 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నాం
  • అమ్మఒడి ద్వారా 43 లక్షల మంది మహిళలకు ప్రయోజనం కలిగింది
రాష్ట్ర వ్యాప్తంగా 28.30 లక్షల ఇళ్లను నిర్మించనున్నామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. మేనిఫెస్టోలో 25 లక్షల ఇళ్లను మాత్రమే ఇస్తామని చెప్పినప్పటికీ... వాటిని 30 లక్షలకు పెంచామని చెప్పారు. ఎన్నికల హామీల్లో 95 శాతం హామీలను అమలు చేశామని అన్నారు. విజయనగరం జిల్లా గుంకలాంలో ఈరోజు ఆయన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందని చెప్పారు.

అమ్మఒడి పథకం ద్వారా 43 లక్షల మంది మహిళలకు ప్రయోజనం కలిగిందని జగన్ అన్నారు. 50 లక్షల మందికి పైగా రైతులకు రైతు భరోసా అందించామని చెప్పారు. ఆసరా పథకం ద్వారా 87 లక్షలకు పైగా మహిళలకు సాయాన్ని అందించామని తెలిపారు. కోటి 35 లక్షల కుటుంబాలకు వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అండగా నిలిచామని చెప్పారు. విద్యా కానుక, విద్యా దీవెన పథకాల ద్వారా విద్యార్థులకు తోడుగా ఉన్నామని తెలిపారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్ లను ఏర్పాటు చేశామని చెప్పారు.


More Telugu News