రామతీర్థం ఘటనకు నిరసనగా టీడీపీ ధర్నా.. బుద్ధా వెంకన్న మౌన దీక్ష

  • జగన్ రెడ్డి పాలనలో మనుషులకు ఎలాగో రక్షణ లేదు
  • ఆఖరికి దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయింది
  • బుద్ధా వెంకన్న విమర్శలు
విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలంలో రామతీర్థం రామ గిరిపై శ్రీరాముడి విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేసిన ఘటనపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. విగ్రహం ధ్వంసం ఘటనను ఖండిస్తూ టీడీపీ నేతలు ధర్నా చేశారు. అలాగే, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మౌన దీక్షకు దిగారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయనకు టీడీపీ నేతలు, కార్తకర్తలు మద్దతు తెలిపారు.

‘జగన్ రెడ్డి పాలనలో మనుషులకు ఎలాగో రక్షణ లేదు. ఆఖరికి దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయింది. విజయ నగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాములు వారి విగ్రహాలు ధ్వంసం చేసిన ఘటనకు నిరసనగా టీడీపీ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాను’ అని బుద్ధా వెంకన్న తెలిపారు.


More Telugu News