రామతీర్థం ఘటన చాలా బాధాకరం: పవన్ కల్యాణ్
- ఓ వైపు అయోధ్యలో రామమందిర నిర్మాణం
- ఏపీలో విగ్రహాల ధ్వంసం
- దేవుళ్ల విగ్రహాలు, ఆలయాలపై దాడులను ఖండిస్తున్నాం
విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలంలో పుణ్య క్షేత్రమైన రామతీర్థం రామ గిరిపై శ్రీరాముడి విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేసిన ఘటనపై పలు పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ... రామతీర్థం ఘటన చాలా బాధాకరమని చెప్పారు.
ఓ వైపు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరం నిర్మిస్తుంటే మరోవైపు ఏపీలో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు. దేవుళ్ల విగ్రహాలు, ఆలయాలపై దాడుల ఘటనలను ఖండిస్తున్నామని తెలిపారు. ఇటువంటి చర్యలు ఇకనైనా ఆగాలని ఆయన అన్నారు.