ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఆ తర్వాత ఉరి వేసుకున్నాడని నాటకం
- ప్రకాశం జిల్లాలోని సంతమాగులూరులో ఘటన
- ఆటో డ్రైవర్‌తో మహిళ వివాహేతర సంబంధం
- భర్త నిలదీశాడని కోపం
ప్రియుడి మోజులో పడి భర్తను కిరాతకంగా చంపేసింది ఓ భార్య. ప్రకాశం జిల్లాలోని సంతమాగులూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. చెన్నుపల్లి శ్రీనివాసరావు (45), ఆయన భార్య సైదాలక్ష్మి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారి పచ్చని కాపురంలోకి ఆటో డ్రైవర్ నల్లగంగుల వెంకటరెడ్డి వచ్చి చిచ్చుపెట్టాడు.
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామానికి చెందిన వెంకటరెడ్డితో సైదాలక్ష్మికి పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారి తీసింది. చివరకు ఈ విషయం భర్త శ్రీనివాసరావుకు తెలిసింది. దీంతో ఆయన భార్యను నిలదీస్తుండేవాడు.
కానీ, భార్య సైదాలక్ష్మి ఆయన మాటలు వినలేదు. అంతేగాక, తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను చంపేయాలని ప్లాన్ వేసింది. రాత్రి సమయంలో శ్రీనివాసరావు మద్యం తాగి వచ్చాడు. కాసేపు, భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. ఆ తర్వాత ఇంట్లో శ్రీనివాసరావు నిద్రపోయాడు.
ఆ తర్వాత సైదాలక్ష్మి తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. భర్త కాళ్లు పట్టుకుని కదలకుండా చేయడంతో.. ప్రియుడు అతడి గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం తన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడంటూ సైదాలక్ష్మి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది.
అయితే, ఆమెపై శ్రీనివాసరావు తమ్ముడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోస్టుమార్టం నివేదిక ఆధారంగా శ్రీనివాసరావుది హత్యగా నిర్ధారించిన పోలీసులు విచారణ జరిపారు. భర్తను హత్య చేసింది తామేనని సైదాలక్ష్మి అంగీకరించింది.