ఇకపై కొత్త మోడల్ కార్లలో ఎయిర్ బ్యాగ్ తప్పనిసరి: కేంద్రం
- ఎయిర్ బ్యాగ్ కారణంగా ప్రయాణికులకు మరింత రక్షణ
- కొత్త కార్లకు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
- పాత కార్లు కూడా తప్పనిసరిగా అమర్చుకోవాల్సిందేనన్న కేంద్రం
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త కార్లలో ఎయిర్‌బ్యాగ్ తప్పనిసరి కానుంది. ఈ మేరకు కేంద్ర రవాణాశాఖ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎయిర్‌బ్యాగ్ కారణంగా ప్రయాణికులకు మరింత భద్రత లభించనుంది. ఎం1 కేటగిరీ వాహనాల్లో డ్రైవర్ సీటులో ఎయిర్ బ్యాగ్‌ను కేంద్రం ఇప్పటికే తప్పనిసరి చేసింది. గతేడాది జులై 1 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. అయితే, డ్రైవర్ పక్కన కూర్చునే వారికి కూడా ప్రమాదం పొంచి ఉండడంతో ఆ సీటులోనూ ఎయిర్ బ్యాగ్‌ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.
వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త మోడల్ కార్లకు ఈ నిబంధన తప్పనిసరి కానుండగా, ప్రస్తుత మోడళ్లు కూడా తప్పనిసరిగా ఎయిర్ బ్యాగ్‌ను అమర్చుకోవాలని పేర్కొన్న కేంద్రం, అందుకు వచ్చే ఏడాది జూన్ 1ని తుది గడువుగా పేర్కొంది. ఈ ప్రతిపాదనపై అభ్యంతరాలు, సూచనలను నెల రోజుల్లోగా తెలపాలని మంత్రిత్వ శాఖ కోరింది.