విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలకు అనుమతులు లేవు: పోలీస్ కమిషనర్

  • అందరూ ఇళ్లలోనే వేడుకలు జరుపుకోవాలి
  • రోడ్ల మీద గుమికూడటం, కేకులు కట్ చేయడం చేయరాదు
  • వైన్ షాపులు రాత్రి 8 గంటల వరకే ఉంటాయి
కరోనా వైరస్ ప్రభావం న్యూ ఇయర్ వేడుకలపై పడింది. మహమ్మారి కారణంగా ఈ ఏడాది అందరూ వేడుకలను తమ తమ ఇళ్లలోనే జరుపుకోవాలని విజయవాడ పోలీస్ కమిషనర్ తెలిపారు. కరోనా రెండో దశలో ఉందని, దీనికి తోడు యూకే వైరస్ నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితం కావాలని చెప్పారు. అన్ని ప్రదేశాల్లో పోలీస్ గస్తీ ఉంటుందని, భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

రోడ్లపై జనాలు గుమికూడటం, కేకులు కట్ చేయడం వంటి కార్యక్రమాలన్నింటినీ నిషేధించామని పోలీస్ కమిషనర్ చెప్పారు. షాపులు, వ్యాపార సంస్థలకు రాత్రి 10 గంటల వరకే అనుమతి ఉంటుందని తెలిపారు. వైన్ షాపులు రాత్రి 8 గంటల వరకు, బార్ అండ్ రెస్టారెంట్లు రాత్రి 11 గంటల వరకు ఉంటాయని చెప్పారు. ఫంక్షన్ హాల్స్, హోటల్స్ లో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని హెచ్చరించారు. అసాంఘిక, అసభ్యకర కార్యక్రమాలు చేపట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.


More Telugu News