30 సీట్ల కంటే ఎక్కువ గెలిచే సీన్ బీజేపీకి లేదు: మమతా బెనర్జీ
- బెంగాల్ ను అన్ని విధాలా అభివృద్ది చేశాం
- రాష్ట్ర ప్రజలందరూ మాతోనే ఉన్నారు
- బెంగాల్ లో బీజేపీని అనుమతించబోము
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ కు, బీజేపీకి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 200లకు పైగా సీట్లలో విజయకేతనం ఎగుర వేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీఎంసీ పని అయిపోయినట్టే అని ఆయన అన్నారు. ఇటీవలి బెంగాల్ పర్యటన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ, బీజేపీకి అంత సీన్ లేదని ఎద్దేవా చేశారు.
పశ్చిమబెంగాల్ లో కమల వికాసం జరిగే పని కాదని మమత అన్నారు. 30 సీట్లకు మించి గెలిచేంత సీన్ బీజేపీకి లేదని జోస్యం చెప్పారు. బెంగాల్ ను తాము అన్ని విధాలా అభివృద్ది చేశామని... తాము అందించిన పాలన వల్ల ప్రజలంతా తమవైపే ఉంటారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. బెంగాల్ లోకి బీజేపీని అనుమతించబోమని అన్నారు. బెంగాల్ లో బీజేపీకి నిరాశ తప్పదని అన్నారు. కొందరు నాయకులు వెళ్లిపోయినంత మాత్రాన తమ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని తెలిపారు.