న్యూ ఇయర్ వేడుకల కోసం గోవా చెక్కేసిన సామ్, చైతూ!

  • మరికొన్నిరోజుల్లో కొత్త సంవత్సరం
  • సంబరాలకు తగిన ప్లేసులు వెదుక్కుంటున్న సెలబ్రిటీలు
  • ఇటీవలే మాల్దీవుల్లో చైతూ పుట్టినరోజు వేడుకలు
  • జనవరి మొదటి వారం వరకు గోవాలోని 
మరికొన్నిరోజుల్లో నూతన సంవత్సరం రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు తగిన లొకేషన్లు వెదుక్కుంటున్నారు. టాలీవుడ్ జోడీ సమంత, నాగచైతన్య కూడా నూతన సంవత్సరాది సంబరాల కోసం గోవా వెళ్లారు. ఈ ఉదయం వారిద్దరూ హైదరబాద్ ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు.

గత నెలలోనే చైతూ పుట్టినరోజును మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసిన సామ్ న్యూ ఇయర్ వేడుకలను గోవాలో జరుపుకోవాలని నిర్ణయించుకుంది. జనవరి మొదటి వారం వరకు ఈ జోడీ గోవాలోని ఓ సుప్రసిద్ధ రిసార్టులో గడపనున్నారట.


More Telugu News