మెడపై మట్టి నలుపుకుంటూ ఉండే ఆయనేనా పవన్ కల్యాణ్ అంటే?: మంత్రి పేర్ని నాని వ్యంగ్యం
- మోదీ, చంద్రబాబుకు చిడతలు కొట్టిన వ్యక్తి పవన్
- చిడతలు వాయిస్తూ డబ్బులు సంపాదించడంలో దిట్ట
- పవన్ ది సెట్టింగులు, ప్యాకప్ ల వ్యవహారమే
నిన్నటి గుడివాడ పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీలో ఎందరో నానిలు ఉన్నారని... ఏ నాని అయితే మనకేంటని అన్నారు. శతకోటి నానిల్లో ఒక బోడి నాని అని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే మంత్రి కొడాలి నాని స్పందించారు. పవన్ కల్యాణ్ బోడిలింగమని... తాము శివలింగాల వంటివారమని దుయ్యబట్టారు.
మరో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, నాని అంటే ఎవరో తెలియదన్న పవన్ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. ఇంతకీ ఆయన ఎవరు? అని ప్రశ్నించారు. మెడపై మట్టి నలుపుకుంటూ ఉండే ఆయనేనా పవన్ కల్యాణ్ అంటే? అంటూ ఎద్దేవా చేశారు.
ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబుకు చిడతలు కొట్టిన వ్యక్తి పవన్ అని పేర్ని నాని ఎద్దేవా చేశారు. చిడతలు వాయిస్తూ డబ్బులు సంపాదించడంలో పవన్ దిట్ట అని విమర్శించారు. 2014లో రైతులు పంటను నష్టపోతే అప్పటి మీ జాయింట్ ప్రభుత్వమైన టీడీపీ-బీజేపీ ప్రభుత్వంతో ఎంత ఇప్పించారని ప్రశ్నించారు. అప్పుడు మీరు, మీ పార్టనర్ ఇచ్చిన దానికంటే తాము ఒక్క రూపాయి ఎక్కువే ఇస్తున్నామని అన్నారు. పవన్ ను నమ్మొద్దని జనాలను కోరుతున్నానని... ఆయనను నమ్మితే కుక్క తోకను పట్టుకుని గోదారి ఈదినట్టేనని చెప్పారు. పవన్ ది సెట్టింగులు, ప్యాకప్ ల వ్యవహారమేనని దుయ్యబట్టారు.