పండుగల కన్నా ప్రాణాలే ముఖ్యమని ప్రజలు గ్రహించాలి: మంత్రి ఈటల

పండుగల కన్నా ప్రాణాలే ముఖ్యమని ప్రజలు గ్రహించాలి: మంత్రి ఈటల
  • న్యూ ఇయర్ వేడుకలు ఇళ్లలోనే జరుపుకోవాలని హితవు
  • శీతాకాలంలో కరోనా వేగంగా వ్యాపిస్తుందన్న ఈటల
  • కొత్త స్ట్రెయిన్ ఏమంత ప్రమాదకారి కాదని వెల్లడి
  • దీన్ని కూడా కట్టడి చేస్తామని ధీమా
దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం రేగిన నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. కొత్త వైరస్ తో ప్రజలు భయపడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. కరోనా కొత్త స్ట్రెయిన్ ఏమంత ప్రమాదకారి కాదని, ఇది కూడా పాత వైరస్ లాంటిదేనని వెల్లడించారు. స్ట్రెయిన్ ను ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కొత్త వైరస్ ను కూడా కట్టడి చేస్తామని ఈటల ధీమాగా చెప్పారు.

అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో, పండుగల కన్నా ప్రాణాలే ముఖ్యమని ప్రజలు గ్రహించాలని హితవు పలికారు. ఇళ్లలోనే ఉండి న్యూఇయర్ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ప్రజలు భయాందోళనలకు గురయ్యే విధంగా మీడియా కథనాలు ప్రసారం చేయరాదని ఈటల పేర్కొన్నారు. శీతాకాలంలో కరోనా వేగంగా వ్యాపించే అవకాశం ఉందని భావిస్తున్నామని తెలిపారు.


More Telugu News