కొత్త కరోనా స్ట్రెయిన్ విస్తరించిన దేశాలు ఇవే!

  • కరోనా కంటే 70 శాతం వేగంగా విస్తరిస్తున్న కొత్త స్ట్రెయిన్
  • భారత్ సహా పలు దేశాలకు విస్తరించిన వైరస్
  • మన దేశంలో ఆరుగురిలో స్ట్రెయిన్ గుర్తింపు
బ్రిటన్ లో పుట్టిన కరోనా కొత్త స్ట్రెయిన్ ఆ దేశంలో ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తోంది. మామూలు కరోనాకంటే 70 శాతం ఎక్కువ వేగంతో ఈ కొత్త స్ట్రెయిన్ వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని పలు దేశాలు వైరస్ తమ దేశంలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ ఇప్పటికే పలు దేశాల్లోకి కొత్త స్ట్రెయిన్ ప్రవేశించింది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, కెనడా, డెన్మార్క్, స్వీడన్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జపాన్, లెబనాన్, నెదర్లాండ్స్, సింగపూర్, ఆస్ట్రేలియా, ఇండియా దేశాల్లో కొత్త స్ట్రెయిన్ ను నిర్ధారించారు.

యూకే నుంచి మన దేశానికి వచ్చిన వారిలో కరోనా సోకిన వారిని గుర్తించి... వారి శాంపుల్స్ ని పరీక్షించగా వారిలో ఆరుగురిలో కొత్త స్ట్రెయిన్ ను గుర్తించారు. దీంతో, వైద్య శాఖాధికారులు అలర్ట్ అయ్యారు. కొత్త స్ట్రెయిన్ కలిగిన వ్యక్తులకు కాంటాక్టులోకి వచ్చిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు.


More Telugu News