వకీల్ సాబ్ కాదు.. షకీలా సాబ్: పవన్ కల్యాణ్ పై కొడాలి నాని ఫైర్
- శతకోటి లింగాల్లో పవన్ కల్యాణే బోడిలింగం
- ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదవి వెళ్లిపోయారు
- వంద మంది పవన్ కల్యాణ్ లు వచ్చినా జగన్ ను ఏమీ చేయలేరు
నిన్న గుడివాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పట్టణంలోని ఓ కూడలిలో ఆయన ప్రసంగిస్తూ, మంత్రి కొడాలి నానిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. శతకోటి లింగాల్లో బోడి లింగం అన్నట్టు... శతకోటి నానీల్లో ఒక నాని అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై కొడాలి నాని అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. శతకోటి లింగాల్లో పవన్ కల్యాణే ఒక బోడిలింగమని... తాను శివలింగం వంటివాడినని అన్నారు. పవన్ బోడిలింగం కాబట్టే... గాజువాక, భీమవరం ప్రజలు కింద పడేసి తొక్కేశారని వ్యాఖ్యానించారు.
పవన్ కల్యాణ్ ను ప్యాకేజ్ స్టార్ అని కొడాలి నాని అన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదవి వెళ్లిపోయారని దుయ్యబట్టారు. పవన్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం మన దురదృష్టమని అన్నారు. వంద మంది పవన్ కల్యాణ్ లు వచ్చినా జగన్ ను ఏమీ చేయలేరని ఎద్దేవా చేశారు.
తన నియోజకవర్గంలో పేకాట క్లబ్బులను ఎక్కడా నిర్వహించడం లేదని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేకాట క్లబ్ లను మూసేస్తున్నామే తప్ప... వాటిని ప్రోత్సహించడం లేదని అన్నారు. పవన్ కల్యాణ్ తనను తాను వకీల్ సాబ్ అనుకుంటున్నారని... కానీ జనాలు మాత్రం ఆయనను షకీలా సాబ్ గా భావిస్తున్నారని చెప్పారు. పవన్ వ్యాఖ్యలపై ఒక బాధ్యత గల మంత్రిగా సమాధానాలు చెప్పేందుకే తాను స్పందిస్తున్నానని తెలిపారు.