కొవిడ్ 19 అంత పెద్ద జబ్బేమీ కాదు: ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర విభాగాధిపతి

  • మనకు కనువిప్పు కలిగించేదని వ్యాఖ్య
  • వేరే జబ్బులతో పోలిస్తే మరణాల రేటు తక్కువని వెల్లడి
  • దాని గురించి భయపడాల్సిన పనిలేదని భరోసా
కోట్లాది మందికి అంటింది.. లక్షలాది మందిని చంపేసింది.. అయినా కూడా కొవిడ్ 19 అంత పెద్ద వైరస్ ఏమీ కాదంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర విభాగాధిపతి మైకేల్ రయాన్. ప్రపంచం మొత్తాన్ని చుట్టేసినా కొవిడ్ 19 అంత పెద్ద జబ్బేమీ కాదని, అది మనకు కనువిప్పు కలిగించేదని ఆయన అన్నారు.

కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాపించిందని, మొదట్లో అది చాలా తీవ్రంగా ఉండేదని గుర్తు చేశారు. కొన్ని కోట్ల మందికి సోకి లక్షలాది మందిని చంపేసిందని, చాలా మందిని అగాథంలోకి నెట్టేసిందని అన్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న వేరే జబ్బులతో పోలిస్తే కరోనా మరణాల రేటు చాలా తక్కువని చెప్పారు. కాబట్టి దాని గురించి అంతగా భయపడాల్సిందేమీ లేదన్నారు.

కాగా, ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల 16 లక్షల 84 వేల 429 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. 17 లక్షల 81 వేల 823 మంది బలయ్యారు. కోటీ 97 లక్షల 81 వేల 718 కేసులు, 3 లక్షల 43 వేల 182 మరణాలతో అమెరికా మొదటి స్థానంలో ఉంది. కేసుల్లో ఇండియా, మరణాల్లో బ్రెజిల్ రెండో స్థానంలో నిలిచాయి.


More Telugu News