డీఎంకే గెలుపు కోసం త్యాగానికి సిద్ధం.. తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ అళగిరి
- రజనీకాంత్‌కు ముఖ్యమంత్రి అయ్యే ఉద్దేశం లేదు
- ఆయన రాజకీయవేత్త కాదు
- దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ పాతాళానికి తొక్కేశారు
రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్న తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) చీఫ్ కేఎల్ అళగిరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధ్యాత్మిక బాటలో పయనిస్తున్న రజనీకాంత్ రాజకీయవేత్త కాదని, ఆయనకు సీఎం అయ్యే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో డీఎంకే కూటమి గెలుపు కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధమని పేర్కొన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ ప్రభుత్వం పాతాళంలోకి తొక్కేసిందని విమర్శించారు. ప్రభుత్వం పతనంపై వైపు పయనిస్తోందని అన్నారు. అన్నాడీఎంకే నేతల అవినీతిపై గవర్నర్‌కు డీఎంకే చీఫ్ స్టాలిన్ ఫిర్యాదు చేశారని, వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ 136వ వార్షికోత్సవం సందర్భంగా రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయమైన సత్యమూర్తి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అళగిరి 150 అడుగుల జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.