నేను కష్టాల్లో ఉన్నప్పుడు జైట్లీ పెద్దన్నలా నా వేలు పట్టుకుని నడిపించారు: అమిత్ షా

  • ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జైట్లీ విగ్రహావిష్కరణ
  • క్రికెట్‌లో జైట్లీ రెండో రకం వారన్న షా
  • ఆయన సేవలకు గుర్తుగానే విగ్రహాన్ని ఆవిష్కరించామన్న మంత్రి
తాను కష్టాల్లో ఉన్నప్పుడు అరుణ్ జైట్లీ పెద్దన్నలా తన వేలు పట్టుకుని తనను నడిపించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుర్తు చేసుకున్నారు. ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో నిన్న దివంగత అరుణ్‌జైట్లీ విగ్రహాన్ని షా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

క్రికెట్‌లో రెండు రకాల మనుషులు ఉంటారన్న ఆయన.. జైట్లీ రెండో రకానికి చెందిన వారని అన్నారు. ఒక వర్గం వారు మైదానంలో ఆడతారని, రెండో వర్గం వారు క్రికెటర్లకు అవసరమైన వాతావరణం, మౌలిక సదుపాయాలు కల్పిస్తారని పేర్కొన్నారు. వీరు చేసిన సేవలకు ఎంతో విలువ ఉంటుందని, అందుకే ఆయన విగ్రహాన్ని స్టేడియంలో ఆవిష్కరించినట్టు చెప్పారు.

తనకు ఏ చిన్న సందేహం వచ్చినా జైట్లీ వాటిని తీర్చేవారని షా గుర్తు చేసుకున్నారు. ఆయన ఎప్పుడూ తెరవెనుకే ఉండేవారని, సమస్యలను పరిష్కరించి గందరగోళాన్ని నివారించేవారని అన్నారు. క్రికెట్‌ను ప్రజలు కెరియర్‌గా ఎంచుకోవడానికి ఆయనే కారణమన్నారు. ఇప్పుడు క్రికెట్‌లోనే ప్రజలు జీవితాన్ని వెతుక్కుంటున్నారని అమిత్ షా పేర్కొన్నారు.


More Telugu News