క్రిస్మస్ విషాదం... కానుకలు పంచిన శాంటాకు కరోనా... 18 మంది మృతి
- మోల్ నగరంలో ఘటన
- క్రిస్మస్ సందర్భంగా వృద్ధులకు కానుకలు
- శాంటా వేషం వేసిన డాక్టర్
- డాక్టర్ కు కరోనా పాజిటివ్
బెల్జియంలో క్రిస్మస్ సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. యాంట్వెర్ప్ ప్రాంతంలోని మోల్ నగరంలో ఉన్న ఓ వృద్ధాశ్రమంలో శాంటాక్లాజ్ చేతి నుంచి బహుమతులు అందుకున్న వారిలో 18 మంది కరోనాతో మరణించారు. శాంటాకు కరోనా సోకగా, ఆ విషయం తెలియని అతగాడు వృద్ధాశ్రమంలో కానుకలు పంచాడు. మొత్తం 121 మంది వృద్ధులకు, 36 మంది సిబ్బందికి ఆ శాంటా కారణంగా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంతకీ ఆ శాంటా వేషం వేసింది ఆ వృద్ధుల బాగోగులు చూసుకునే వైద్యుడేనట.
దీనిపై ఆ ఓల్డేజ్ హోం నిర్వాహకులు స్పందిస్తూ, కరోనా సోకిన విషయం ఆ డాక్టర్ కు తెలియదని వెల్లడించారు. శాంటా వేషంలో బహుమతులు పంచిన తర్వాత పరీక్ష చేయగా కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని తెలిపారు. మోల్ నగర మేయర విమ్ కేయర్స్ స్పందిస్తూ, వృద్ధులకు క్రిస్మస్ కానుకలు పంచే సమయంలో నిబంధనలు పాటించలేదని ఆరోపించారు.