ఏపీ కరోనా అప్ డేట్: విజయనగరంలో ఇవాళ కూడా కొత్త కేసులు నిల్
- గత 24 గంటల్లో 37,381 కరోనా పరీక్షలు
- 212 మందికి పాజిటివ్
- అత్యధికంగా గుంటూరు జిల్లాలో 53 కేసులు
- యాక్టివ్ కేసుల సంఖ్య 3,423
ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి బాగా నిదానించింది. విజయనగరం జిల్లాలో వరుసగా రెండో రోజు కూడా కొత్త కేసులేమీ నమోదు కాలేదు. అటు కొన్ని జిల్లాల్లో వేళ్లమీద లెక్కించదగ్గ స్థాయిలో పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గడచిన 24 గంటల్లో ఏపీలో 37,381 కరోనా పరీక్షలు నిర్వహించగా, 212 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
జిల్లాల వారీగా చూస్తే, అత్యధికంగా గుంటూరు జిల్లాలో 53 కేసులు వచ్చాయి. చిత్తూరు జిల్లాలో 42, కృష్ణా జిల్లాలో 32, తూర్పు గోదావరిలో 21 కేసులు గుర్తించారు. కర్నూలు జిల్లాలో 4, శ్రీకాకుళంలో 5, పశ్చిమ గోదావరిలో 5, నెల్లూరు జిల్లాలో 7, ప్రకాశం జిల్లాలో 8, కడప జిల్లాలో 9 కొత్త కేసులు వచ్చాయి.
అదే సమయంలో 410 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,81,273 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,70,752 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,423 మందికి చికిత్స జరుగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 7,098కి చేరింది.