కేటీఆర్ ను సీఎం చేస్తే.. టీఆర్ఎస్ పార్టీలో సంక్షోభం వస్తుంది: లక్ష్మణ్

  • దొడ్డి దారిన కేటీఆర్ ను సీఎం చేయాలనుకుంటున్నారు
  • ఎన్నికల సంఘాన్ని టీఆర్ఎస్ గుప్పిట్లో పెట్టుకుంది
  • గ్రేటర్ లో కొత్త కౌన్సిల్ ను ఎందుకు ఏర్పాటు చేయడం లేదు?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. తన కుమారుడు కేటీఆర్ కు భవిష్యత్తులో సీఎం అయ్యే అవకాశం లేదనే ఆలోచనతో... ఆయనను దొడ్డి దారిన సీఎం చేసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. ఒకవేళ కేటీఆర్ ను సీఎంని చేస్తే టీఆర్ఎస్ పార్టీలో సంక్షోభం వస్తుందని అన్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని టీఆర్ఎస్ పార్టీ తన గుప్పిట్లో పెట్టుకుందని లక్ష్మణ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీదే నైతిక విజయమని చెప్పారు. హడావుడిగా ఎన్నికలను నిర్వహించకుండా ఉండి ఉంటే గ్రేటర్ ఎన్నికలలో ఒక సీటు కూడా టీఆర్ ఎస్ కు వచ్చేది కాదని అన్నారు. కొత్త కౌన్సిల్ ను ఇంత వరకు ఏర్పాటు చేయలేదని, ఇది రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్టేనని అన్నారు. అంబేద్కర్ పట్ల కేసీఆర్ కు ఏ మాత్రం గౌరవం ఉన్నా వెంటనే కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.


More Telugu News