వెలగపూడి రాళ్ల దాడి ఘటనలో పోలీసుల పాత్ర ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం: హోంమంత్రి సుచరిత

  • ఇటీవల వెలగపూడిలో రాళ్లదాడి
  • మహిళ మృతి, పలువురికి గాయాలు
  • వెలగపూడిలో ఇవాళ పర్యటించిన హోంమంత్రి
  • మృతురాలి కుటుంబీకులకు పరామర్శ
  • రూ.10 లక్షల పరిహారం ప్రకటన
ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఇవాళ అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో పర్యటించారు. ఇటీవల వెలగపూడిలో రాళ్లదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన మహిళ కుటుంబీకులను, గాయపడిన వారిని హోంమంత్రి ఇవాళ పరామర్శించారు. రాళ్లదాడి ఘటనలో పోలీసుల పాత్ర ఉందని తేలితే వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా, ఈ పర్యటనలో  వైసీపీ ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున కూడా పాల్గొన్నారు.

అయితే, ఈ దాడి ఘటన వెనుక ఎంపీ పాత్ర ఉందని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఎంపీ ప్రమేయంపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. హోంమంత్రి మాట్లాడుతూ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించామని తెలిపారు. మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఆమె పిల్లల్లో ఒకరికి విద్యార్హతను బట్టి ఉద్యోగ అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.


More Telugu News