దేశ కోసం గళం విప్పుతూనే ఉంటాం : రాహుల్ గాంధీ, ప్రియాంక ట్వీట్లు
- సత్యం, సమానత్వం కోసం పనిచేస్తాం
- పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రతిజ్ఞను మళ్లీ చేస్తున్నాం: రాహుల్
- కేంద్ర సర్కారు రైతులకు కచ్చితంగా జవాబుదారీగా నడుచుకోవాలి: ప్రియాంక
కేంద్ర సర్కారుపై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విరుచుకు పడ్డారు. పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారు ట్వీట్లు చేశారు. దేశ హితం కోసం గళం విప్పడానికి తమ పార్టీ ఎల్లప్పుడూ సంసిద్ధంగానే ఉంటుందని రాహుల్ గాంధీ చెప్పారు. సత్యం, సమానత్వం కోసం పనిచేస్తామని తెలిపారు. తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రతిజ్ఞను మళ్లీ చేస్తున్నామని చెప్పారు.
కాగా, దేశంలో రైతులు ఆందోళన కొనసాగిస్తోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాడుతున్న భాష ఏ మాత్రం సరికాదని ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి భాష వాడటం ఘోరమని, కేంద్ర సర్కారు రైతులకు కచ్చితంగా జవాబుదారీగా నడుచుకోవాల్సిందేనని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతులతో చర్చించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ నేత ఏకే ఆంటోనీ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. ఇందులో ప్రియాంక గాంధీ, సీనియర్ నేతలు ఆజాద్, ఖర్గే తదితరులు పాల్గొన్నారు.