భారత్-ఆసీస్ టెస్టు: మూడోరోజు ముగిసిన ఆట.. కష్టాల్లో ఆస్ట్రేలియా

  • రెండో ఇన్నింగ్స్ ఆడుతోన్న ఆసీస్
  • ఆరు వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేసిన వైనం
  • రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 2 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా
  • మొదటి ఇన్నింగ్స్‌లోనూ 195 పరుగులకే ఆలౌట్
  • తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 326 పరుగులు
మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో  జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్ ఆడుతోన్న ఆసీస్ ప్రస్తుతం రెండు పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటముగిసే సమయానికి ఆసీస్ ఆరు వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లోనూ భారత బౌలర్ల ధాటికి ఆసీస్ 195 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 326 పరుగులు చేసింది. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో మయాంక్ అగర్వాల్ 0, శుభ్‌మాన్ గిల్ 45, చటేశ్వర్ పుజారా 17, హనుమ విహారి 21, రిషబ్ పంత్ 29, అజింక్యా రహానె 112, రవీంద్ర జడేజా 57, రవిచంద్రన్ అశ్విన్ 14, ఉమేశ్ యాదవ్ 9, బుమ్రా 0, సిరాజ్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజాకు రెండు, బుమ్రా, ఉమేశ్ యాదవ్, సిరాజ్, అశ్విన్‌కు తలో వికెట్ దక్కాయి.

రెండో ఇన్నింగ్స్‌లో ఈ రోజు ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లో మాథ్యూవేడ్ 40, లబుషేన్ 28, జో బర్న్స్ 4, స్మిత్ 8, టిమ్ 1, ట్రావిస్ హెడ్ 17 పరుగలు చేసి ఔటయ్యారు. క్రీజులో కామెరూన్ 17, కమిన్స్ 15 పరుగులతో ఉన్నారు.


More Telugu News