కొత్తగా ఎన్నికైన తమ కార్పొరేటర్లతో ట్యాంక్ బండ్ వద్ద బీజేపీ నేతల నిరసన
- గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఫలితాలు వచ్చాయి
- రాష్ట్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వట్లేదు
- ప్రజా స్వామ్య బద్ధంగా గెలిచిన కార్పొరేటర్లను అవమానిస్తున్నారు
- జీహెచ్ఎంసీకి కొత్త పాలకమండలిని ఏర్పాటు చేయాలి
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఉండే అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిచిన 48 మంది బీజేపీ కార్పొరేటర్లతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు అక్కడకు వచ్చారు.
గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఫలితాలు వచ్చినా రాష్ట్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వట్లేదని నిరసన తెలుపుతున్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం ఉంచారు. గ్రేటర్ ఫలితాలపై వెంటనే గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్ లో ప్రజా స్వామ్య బద్ధంగా గెలిచిన కార్పొరేటర్లను అవమానిస్తున్నారని, వెంటనే జీహెచ్ఎంసీకి కొత్త పాలకమండలిని ఏర్పాటు చేయాలని వారు అన్నారు. బీజేపీ కార్పొరేటర్లను కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ ప్రయత్నాలు జరుపుతోందని వారు ఆరోపణలు గుప్పించారు. గ్రేటర్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలవలేదనే కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించకుండా జాప్యం చేస్తున్నారని అన్నారు.