క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగిన కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష పెళ్లి

  • చరణ్ రెడ్డి అనే యువకుడితో పెళ్లి
  • రంగారెడ్డి జిల్లా పాటిగడ్డ లూర్దు మాత చర్చిలో వివాహం
  • హాజరైన షాద్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే అంజ‌య్య యాద‌వ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం ఈరోజు చరణ్ రెడ్డి అనే యువకుడితో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఓ చర్చిలో జరిగింది. రంగారెడ్డి జిల్లా పాటిగడ్డ లూర్దు మాత చర్చిలో జరిగిన ఈ పెళ్లికి షాద్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే అంజ‌య్య యాద‌వ్‌, జ‌డ్పీ వైస్ చైర్మ‌న్ గ‌ణేశ్‌తో పాటు మ‌హిళా సంక్షేమ శాఖ క‌మిష‌న‌ర్ దివ్య దేవ‌రాజు హాజరయ్యారు.
 
కాగా, హైదరాబాద్‌లోని బండ్లగూడ అమ్మాయి ప్రత్యూష సవతి తల్లి చేతిలో గతంలో చిత్రహింసలు అనుభవించిన విషయం తెలిసిందే. తన ఆస్తిని కూతురు ప్రత్యూష పేరిట రాసి ఆమె తల్లి చనిపోవడంతో ఆమె తండ్రి, సవతి తల్లి కలిసి ప్రత్యూషను చిత్రహింసలకు గురి చేశారు.

ఆమె పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. చివరకు ఈ  విషయం అధికారులకు తెలియడంతో ప్రత్యూషను ఆసుపత్రిలో చేర్పించారు. ఆ సమయంలో  సీఎం కేసీఆర్‌ ప్రత్యూషను దత్తత తీసుకున్నారు. అనంతరం ఆమె నర్సింగ్‌కోర్సును పూర్తి చేసింది. ప్రత్యూష మనసు పడిన రాంనగర్‌కు చెందిన మమత, మర్రెడ్డి దంపతుల కొడుకు చరణ్‌ రెడ్డితో ఆమె వివాహం జరిగింది.


More Telugu News