ఢిల్లీలో నేడు డ్రైవర్ రహిత మెట్రో రైలును ప్రారంభించనున్న ప్రధాని

  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభం
  • ఆ వెంటనే అందుబాటులోకి సేవలు
  • వచ్చే ఏడాది నాటికి 94 కిలోమీటర్ల మేర విస్తరణ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలో నేడు డ్రైవర్ రహిత మెట్రో రైలును ప్రారంభించనున్నారు. పశ్చిమ జనక్‌పురి-బొటానికల్ గార్డెన్ మధ్య 37 కిలోమీటర్ల పరిధిలో సేవలు అందించనున్న ఈ రైలును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రారంభించనున్నారు. ఆ వెంటనే సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ డ్రైవర్ రహిత రైలులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.

రవాణా వ్యవస్థలో నవశకానికి ఇది నాంది అని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అభివర్ణించింది. 2021 నాటికి మజ్లిస్ పార్క్-శివ్ విహార్ మధ్య 57 కిలోమీటర్ల పొడవున పింక్ లైన్ మార్గంలోనూ ఈ సేవలను విస్తరించాలని ఢిల్లీ మెట్రో యోచిస్తోంది. ఈ లైన్ కనుక ప్రారంభమైతే ఢిల్లీ మెట్రోలో మొత్తం 94 కిలోమీటర్ల మేర డ్రైవర్ రహిత రైలు సేవలు అందుబాటులోకి వస్తాయి.


More Telugu News