కరోనాతో బాధపడుతున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి.. అత్యవసరంగా ఆసుపత్రికి తరలింపు
- ఈ నెల 18న కరోనా బారినపడిన త్రివేంద్రసింగ్ రావత్
- ఆరోగ్యం నిలకడగా ఉందన్న అధికారులు
- ముందు జాగ్రత్తగానే ఆసుపత్రికి తరలించినట్టు వివరణ
కరోనాతో బాధపడుతున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్‌ను నిన్న డెహ్రాడూన్‌లోని డూన్ ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 18న ఆయన కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తనతోపాటు భార్య, కుమార్తెలోనూ వైరస్ లక్షణాలు బయటపడినట్టు తెలిపారు. అప్పటి నుంచి హోం ఐసోలేషన్‌లో ఉన్న ఆయనను నిన్న సాయంత్రం అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆయన జ్వరం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయనను ఆసుపత్రిలో చేర్చినట్టు డూన్ ఆసుపత్రిలో కొవిడ్-19 నోడల్ అధికారి డాక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.