నాకు ముఖ్యమంత్రి పదవి కూడా అవసరం లేదు: నితీశ్‌ కుమార్

  • బీజేపీ సీఎం పదవిని ఆశిస్తుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు
  • నేను ముఖ్యమంత్రి కుర్చీకి అంకితం కాలేదు
  • సీఎం పదవి వద్దని ఇంతకు ముందే మిత్రపక్షాలకు చెప్పాను
జేడీయూ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి బీహార్ ముఖ్యమంత్రి  నితీశ్ కుమార్ తప్పుకుని ఆ స్థానంలో రాజ్యసభ సభ్యుడు రామచంద్ర ప్రసాద్ సింగ్ ను కొత్త చీఫ్ గా నియమించిన విషయం తెలిసిందే. తాజాగా నితీశ్ మాట్లాడుతూ తనకు ముఖ్యమంత్రి పదవి కూడా అవసరం లేదని చెప్పారు. బీహార్‌లోని తమ మిత్రపక్షం బీజేపీ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారని జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో నితీశ్ అన్నారు.  

తాను ముఖ్యమంత్రి కుర్చీకి అంకితం కాలేదని ఆయన చెప్పారు. నిజానికి తాను అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సీఎంగా బాధ్యతలు స్వీకరించలేనని ఎన్డీఏలోని పార్టీలకు తెలిపానని అన్నారు. అయితే, ఇందుకు వారు ఒప్పుకోలేదని ఆయన చెప్పారు. తనపై చాలా ఒత్తిడి తర్వాత తాను మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చిందని అన్నారు. ఈ పదవి పట్ల తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని, సీఎం పదవి అవసరం లేదని చెప్పారు.


More Telugu News