విదేశీ పర్యటనకు రాహుల్ గాంధీ.. కొన్ని రోజులపాటు అక్కడే!

  • నేడు కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం
  • వ్యక్తిగత పర్యటన అన్న కాంగ్రెస్
  • ఇటలీ వెళ్లినట్టు సమాచారం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇది ఆయన వ్యక్తిగత పర్యటన అని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఆయన ఏ దేశానికి వెళ్లారో మాత్రం వెల్లడించలేదు. రాహుల్ గాంధీ కొన్ని రోజులపాటు విదేశాల్లోనే ఉండనున్నట్టు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు.  

అయితే, రాహుల్ ఇటలీ వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఖతర్ ఎయిర్‌వేస్‌లో నిన్న ఉదయం మిలన్ వెళ్లినట్టు సమాచారం. అక్కడ రాహుల్ అమ్మమ్మ నివసిస్తున్నారు. గతంలోనూ రాహుల్ అక్కడికి వెళ్లారు. కాగా, నేడు కాంగ్రెస్ 136వ వ్యవస్థాపక దినోత్సవం. ఏఐసీసీ హెడ్‌క్వార్టర్స్‌లో జెండా ఎగువేయనున్నారు.


More Telugu News